పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఇవాళ్టి నుంచి ఇంగ్లీష్ లోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ గా ట్రెండింగ్ లో కొనసాగుతూ వచ్చింది సలార్. థియేట్రికల్ రిలీజ్ లో దాదాపు 700 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా…ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
రెండు వారాలకు పైగా ట్రెండింగ్ లో ఉండటం ఒక రికార్డ్ గా చెబుతున్నారు. యానిమల్ లాంటి బాలీవుడ్ మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చినా సలార్ తన ప్లేస్ నిలబెట్టుకుంది. హోంబలే ఫిలింస్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను రూపొందించారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ హిట్ తో సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వపై మరింత హైప్ ఏర్పడుతోంది. అటు ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 మరింత గ్రాండ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా నెక్ట్ ఇయర్ థియేటర్స్ లోకి రానుంది.