స్టార్ హీరో ప్రభాస్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా నిన్న అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ లోని తమ ఫేవరేట్ సీన్స్, యాక్షన్ పార్ట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో సలార్ ట్రెండింగ్ అవుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.
హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 700కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఓ బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ కు టీమ్ సిద్ధమవుతోంది. సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వ ఫస్ట్ పార్ట్ కంటే ఇంకా బిగ్ స్పాన్ లో ఆకట్టుకుంటుందని టీమ్ చెబుతున్నారు.