పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో సలార్ పలు భాషల్లో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. థియేటర్స్ లో సలార్ ఎలాంటి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుందో..ఓటీటీలోనూ అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు నిజమవుతున్నాయి.
హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 700కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది. త్వరలో సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వ షూటింగ్ కు మూవీ టీమ్ రెడీ అవుతున్నారు. నెక్ట్ ఇయర్ ఈ సినిమా రిలీజ్ కు రానుంది. సలార్ 2 ఇంకా బిగ్ రేంజ్ లో పిక్చరైజ్ చేస్తామని మూవీ టీమ్ చెబుతున్నారు.