స్టార్ హీరో ప్రభాస్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా త్వరలో జపాన్ లో రిలీజ్ కాబోతోంది. సమ్మర్ లో జపానీస్ భాషలో సలార్ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మేరకు జపనీస్ లో డిజైన్ చేయించిన సలార్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ ను ఫ్యాన్స్, నెటిజన్స్ షేర్ చేస్తున్నారు.
బాహుబలి తర్వాత జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా పెరిగారు. ఆయన బర్త్ డేను కూడా అక్కడి అభిమానులు జరుపుకుంటారు. జపాన్ లో ప్రభాస్ ప్రతి సినిమా రిలీజ్ అవుతుంటుంది. ఈసారి సలార్ ను జపనీస్ భాషలోనే విడుదల చేయబోతున్నారు. ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తెచ్చుకుంటున్న సలార్ జపాన్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.