పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డీజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. రేపటి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. థియేటర్ లో సలార్ ను ఎంజాయ్ చేసినా…ఓటీటీలో మళ్లీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.
థియేట్రికల్ గా 700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది సలార్. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. సలార్ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీబాయి తదితరులు కీలక పాత్రలు పోషించారు.