హైదరాబాద్‌లో సికిందర్ షూటింగ్‌..! బెదిరింపులు లెక్కచేయని సల్మాన్‌..

Spread the love

హైదరాబాద్‌లో సికిందర్ షూటింగ్‌..!
బెదిరింపులు లెక్కచేయని సల్మాన్‌..!

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉందని తెలిసినా, అలాంటి భయాలేమీ పెట్టుకోకుండా సల్మాన్‌ఖాన్‌ షూటింగ్‌లో బిజిబిజీగా గడుపుతున్నారు. మరింత కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్‌లోని సికిందర్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం సల్మాన్ నటిస్తోన్న సికిందర్‌ షూటింగ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతోంది.

తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భారీ సన్నివేశాన్ని చిత్రకీరిస్తున్నారు. ఇదే ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చెల్లి అర్పితా ఖాన్‌కు 2014లో సల్మాన్‌ వివాహం జరిపించిన విషయం తెలిసిందే.

సికిందర్‌ మూవీలో సల్మాన్‌ ఖాన్‌కు జోడిగా రష్మిక మందన్నా నటిస్తోంది. గజనీ, హాలీడే వంటి చిత్రాలతో పేరుగాంచిన తమిళ డైరెక్టర్ AR మురుగుదాస్‌ సికిందర్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సాజిద్ నదియావాలా ఈ చిత్రానికి నిర్మాత.

2014లో కిక్ మూవీ తర్వాత సల్మాన్, సాజిద్ ఆధ్వర్యంలో వస్తున్న రెండో చిత్రం సికిందర్. ఈ చిత్రాన్ని 2025 ఈద్‌ పండుగనాడు రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

వాస్తవానికి అనుకున్నదానికంటే లేట్‌గా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎందుకంటే ఆప్తుడు, మిత్రుడు మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌ఖాన్‌కు భద్రత పెంచిన విషయం తెలిసిందే. గట్టి బందోబస్తు నడుమ సికిందర్ చిత్రంలో పాల్గొంటున్నాడు సల్మాన్‌ఖాన్. మరోవైపు బిగ్‌బాస్ హిందీ సీజన్‌-18కి సల్లూభాయ్ హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...