ఇటీవల సినిమాలు తగ్గించి పర్సనల్ లైఫ్ కు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్న స్టార్ హీరోయిన్ సమంత ఛారిటీ కార్యక్రమంలో మెరిసింది. ప్రత్యుష ఫౌండేషన్ లో పిల్లలతో సరదాగా కొద్దిసేపు గడిపింది. ప్రత్యుష ఫౌండేషన్ కు సమంత విరాళాలు ఇస్తుంటుంది. ఈ సేవా కార్యక్రమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇవాళ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా సమంత ప్రత్యుష ఫౌండేషన్ లో పిల్లలతో టైమ్ స్పెండ్ చేసింది.
ఇక్కడి పిల్లలకు సమంత కేక్ కట్ చేసి తినిపించింది. సమంత తమ దగ్గరకు రావడంతో అక్కడి పిల్లలు హ్యాపీగా ఫీలయ్యారు. ఆమెతో సంతోషంగా గడిపారు. సమంత పిల్లలతో ఉన్న ఈ ఫొటోస్ ను ప్రత్యుష ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ పోస్ట్ కు సమంత అభిమానులతో పాటు నెటిజన్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. సమంత మంచి మనసుకు ప్రశంసలతో కామెంట్స్ చేస్తున్నారు. ఖుషి సినిమా తర్వాత తెలుగులో సమంత కొత్త మూవీ అనౌన్స్ చేయలేదు.