సమంత సిటాడెట్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ అప్డేట్ ఇచ్చింది సమంత. సిటాడెల్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా..ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమంత తన క్యారెక్టర్ కు డబ్బింగ్ స్టార్ట్ చేసింది. డబ్బింగ్ స్టూడియో నుంచి సమంత తన ఫొటో తీసుకుని ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్చేసింది.
లెట్స్ గో అంటూ క్యాప్షన్ రాసిన ఈ పోస్ట్ నెటిజన్స్ ను ఆకర్షిస్తోంది. అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్ ను హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా..సికిందర్ ఖేర్, కేకే మీనన్ ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. అమోజాన్ ప్రైమ్ వీడియోలో సిటాడెల్ త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది.