కెరీర్ లో చిన్న బ్రేక్ తీసుకున్న సమంత మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బయట ప్రొడ్యూసర్స్ తో పాటు సొంత ప్రొడక్షన్ లో సమంత మా ఇంటి మహాలక్ష్మి అనే సినిమా చేస్తోంది. సౌత్ తో పాటు హిందీలోనూ ఆమె సినిమాలు, వెబ్ సిరీస్ లు అంగీకరిస్తోంది. సమంతకు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా మంచి పేరు తెచ్చాయి.
అందుకే మరో కొత్త వెబ్ సిరీస్ కు సైన్ చేసింది సమంత. తనకు ఫ్యామిలీ మ్యాన్ అనే మైల్ స్టోన్ లాంటి ప్రాజెక్ట్ ఇచ్చిన దర్శకద్వయం రాజ్ డీకేతో సమంత ఈ కొత్త వెబ్ సిరీస్ చేయబోతోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ కు రక్త్ జీబ్ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. ఈ వెబ్ సిరీస్ లో ఆదిత్యరాయ్ కపూర్ అనే యంగ్ హీరోతో సమంత రొమాన్స్ చేయబోతోంది. ఆగస్టు నుంచి బిగిన్ చేయనున్నారు.