“సినిమా బండి”సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రం ‘పరదా’ను రూపొందిస్తున్నారు. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
చదవండి: “తంగలాన్” కు జీరో కట్స్ తో యూఎ సర్టిఫికెట్
తాజాగా మేకర్స్ రత్నమ్మ గా సంగీత క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హోమ్లీగా కనిపించిన సంగీత ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.