నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్న ‘సరిపోదా శనివారం’. పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో లాంచ్ చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్ వార్ ని ట్రైలర్ చూపించింది. ఈ నెల 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘సరిపోదా శనివారం’ విడుదల కానుంది. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో
హీరో నాని మాట్లాడుతూ – సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలసి ఈ ట్రైలర్ చూడటం చాలా హ్యాపీగా వుంది. ఈ మంత్ ఎండ్ కి అదిరిపోతుంది. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ అందరికీ ప్రేమకి థాంక్. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే వుంటాను. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నారు.
చదవండి: వచ్చేది మేమే…కాపాడేదీ మేమే : షర్మిల
నటుడు ఎస్ జే సూర్య మాట్లాడుతూ – ట్రైలర్ కి మించి సినిమా వుంటుంది. సినిమా సూపర్ గా వచ్చింది. నాని మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. దానయ్య గారు భారీగా ఖర్చు చేసి ఈ సినిమా చేశారు. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్ సెట్ లో వేశారు. అది చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. మంచి ఎనర్జీ వున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.