ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్, భావన హీరో హీరోయిన్లుగా నటించి రీసెంట్ గా ఆడియెన్స్ ముందుకొచ్చిన సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా నిన్న రిలీజైన “సర్కారు నౌకరి” సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సినిమా విడుదలైన ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.
మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుండటంతో కలెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ ముందు వచ్చిన క్రేజ్ తో డే 1 కలెక్షన్స్ బాగుండటం, సినిమాకు మీడియా వచ్చిన పాజిటివ్ రివ్యూస్, థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు సినిమా ఆకట్టుకుందనే టాక్ రావడంతో “సర్కారు నౌకరి” సక్సెస్ దిశగా రన్ అవుతోంది. ఈ సినిమాలో ఓ మంచి సందేశాన్ని, వినోదాన్ని కలిపి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొత్త వాళ్లైనా ఆకాష్, భావన తమ నటనతో అందరినీ మెప్పించారు.