గాయని సునీత కుమారుడు ఆకాష్, భావన హీరో హీరోయిన్లుగా నటించి రీసెంట్ గా ఆడియెన్స్ ముందుకొచ్చిన సినిమా “సర్కారు నౌకరి”. న్యూ ఇయర్ సందర్భంగా ఈ నెల 1న “సర్కారు నౌకరి” థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది. ఇవాళ్టి నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో “సర్కారు నౌకరి” సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
“సర్కారు నౌకరి” చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ కలిపి కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఎయిడ్స్ వ్యాప్తి పట్ల సమాజంలో అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ అధికారి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఈ సినిమాలో చూపించారు. ఓటీటీలో ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకునేలా ఉంది.