సెలబ్రిటీల కంటే వారి చుట్టూ ఉంటే సెక్యూరిటీ వాళ్లే అత్యుత్సాహం చూపిస్తుంటారు. చూడండి మేము ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నామో అని తమ బాస్ ల దగ్గర బిల్డప్ ఇచ్చేందుకు చాలాసార్లు ఓవర్ గా రియాక్ట్ అవుతుంటారు. ఇలా నాగార్జున సెక్యూరిటీ కూడా రీసెంట్ గా దురుసుగా ప్రవర్తించారు.
ఇది నాగార్జునను విమర్శల పాలుచేస్తోంది. ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి నాగార్జునను కలిసేందుకు రాగా…ఆయన సెక్యూరిటీ సిబ్బంది సదరు వ్యక్తిని లాగి విసిరేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ అవుతోంది. ఇది మానవత్వం కాదంటూ విమర్శలు వస్తున్నాయి. నాగార్జునను ట్యాగ్ చేస్తుంటడంతో ఆయన స్పందించారు. అతనికి సారీ చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటా అంటూ నాగార్జున సోషల్ మీడియా ద్వారా సారీ చెప్పారు.