ఓ నలభై కోట్ల రూపాయల గ్రాస్ సాధించేందుకు..అదీ వరల్డ్ వైడ్ గా..సీనియర్ హీరోలు ఎంత కష్టపడాల్సి వస్తుందో చూస్తుంటే..వాళ్ల పనై పోయినట్లు అనిపిస్తోంది. నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు 8 రోజుల పాటు కిందా మీదా పడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ సినిమా 8 రోజుల్లో 44.8 కోట్ల రూపాయల వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా దక్కించుకుని పెట్టుబడి తిరిగి రాబట్టింది. ఇప్పటి నుంచి ఈ సినిమా లాభాల్లోకి వస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు. అయితే ఈపాటికే చాలా థియేటర్స్ లో ఈ సినిమా కలెక్షన్స్ చల్లబడ్డాయి. దాంతో లాభాలు పెద్దగా ఆశించలేరు. అయితే నష్టపోలేదు కాబట్టే అదే లాభం అనుకోవాలి.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ సంస్థకు నాలుగు ఫ్లాప్స్ తర్వాత ఊరటగా ఈ సినిమా బయటపడింది. నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అషికా రంగనాథ్, రుక్సర్ థిల్లాన్ వంటి మంచి కాస్టింగ్ ఉంది. సినిమా సక్సెస్ లో వీళ్ల ప్రెజెన్స్ పనికొచ్చింది. ఓల్డ్ స్టైల్ మేకింగ్ తో నా సామిరంగ ఇప్పటి ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. పండుగ టైమ్ కాబట్టి ఈమాత్రం లాక్కొచ్చింది. ఇక సీనియర్ హీరోలకు బాక్సాఫీస్ వేట అంత సులువు కాదని అనుకోవచ్చు.