చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. నాటి నుంచి నేటికీ అదే స్పీడుతో సినిమాలు చేస్తుండడం విశేషం. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చేలా ఈ సీనియర్ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మరింతగా స్పీడు పెంచారు. ఇంతకీ.. ఎవరెవరు ఏ ఏ సినిమాలు చేస్తున్నారు..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తోన్న విశ్వంభర మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఒక పాట కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. జనవరి 10న విశ్వంభర చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక చిరు నెక్ట్స్ ఏంటంటే.. హరీష్ శంకర్ ఓ స్టోరీ రెడీ చేస్తున్నారు. అలాగే మారుతి కూడా ఎప్పటి నుంచో చిరుతో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. వీరిద్దరు కాకుండా మరో ఇద్దరు దర్శకులు చిరు కోసం వెయిటింగ్ లో ఉన్నారు. అయితే.. త్వరలోనే చిరు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించనున్నారు. విశ్వంభర రిలీజ్ తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ లెక్కన నెక్ట్స్ ఇయర్ చిరు నుంచి రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అఖండ 2 చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో మూవీ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని సమాచారం. డిసెంబర్ లో సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ లెక్కన బాలకృష్ణ కూడా నెక్ట్స్ ఇయర్ రెండు సినిమాలు రిలీజ్ చేయనున్నారు. ఇక నాగార్జున ప్రస్తుతం కుబేర, కూలీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా నెక్ట్స్ ఇయర్ లో విడుదల కానున్నాయి. ఇక వెంకీ అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్. ఈ మూవీ తర్వాత చేసే సినిమాను సంక్రాంతి తర్వాత అనౌన్స్ చేస్తారు. వెంకీ నుంచి కూడా నెక్ట్స్ ఇయర్ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ విధంగా ఆ నలుగురు సీనియర్ హీరోలు స్పీడు పెంచి నెక్ట్స్ ఇయర్ రెండు సినిమాలు రిలీజ్ చేస్తుండడం విశేషం.