శంకర్ సినిమా అంటే ఒకప్పుడు సంచలనం. ఇప్పుడు ఆయన ఎంత కష్టపడినా.. కాలం కలిసి రావడం లేదు. ఇండియన్ 2 కోసం తపించాడు.. తపస్సు చేసినట్టుగా సినిమాని తెరకెక్కించాడు కానీ.. ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. విచిత్రం ఏంటంటే.. శంకర్ సినిమా.. పైగా కమల్ హాసన్ హీరో తమిళ్ లో ఎక్కువ కలెక్షన్ రావాలి కానీ.. తెలుగులో వచ్చినంత కలెక్షన్ కూడా తమిళ్ లో రాలేదంటే.. శంకర్ టైమ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే.. శంకర్ ఎప్పటి నుంచో తెరకెక్కిస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో, ఉత్తమాభిరుచి గల దిల్ రాజు నిర్మాత. ఈ క్రేజీ కాంబో షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. క్రిస్మస్ కు గేమ్ ఛేంజర్ రావడం ఖాయం అంటూ దిల్ రాజు ఇటీవల అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే.. శంకర్ ఇప్పటి వరకు జరిగిన ఎడిటింగ్ చూసుకున్న తర్వాత కొన్ని సీన్స్ రీషూట్స్ చేయాలని డిసైడ్ అయ్యారట. చరణ్ డేట్స్ కావాలని అడిగారట. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
చదవండి: స్టే ఆర్డర్ ఉన్నా ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు – హీరో నాగార్జున
జీడిపాకంలా… గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇలా జరుగుతూనే ఉంటే.. ఇక ఎప్పుడు పూర్తవుతుంది..? చరణ్ ఎప్పుడు బుచ్చిబాబు షూట్ లో జాయిన్ అవ్వాలి..? గేమ్ ఛేంజర్ ఎప్పుడు థియేటర్స్ లోకి రావాలి..? రీషూట్ అంటే.. చరణ్ ఒక్కడే డేట్స్ ఇస్తే సరిపోదు కదా.. ఆయనతో పాటు ఆ సీన్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్లందరి డేట్స్ కావాలి. అసలే దిల్ రాజు ఈమధ్య డిజాస్టర్స్ తో నష్టాల్లో ఉన్నాడు. శంకర్ ఇలా రీషూట్స్ అంటే.. దిల్ రాజుకు కాస్త కష్టమే. మొత్తానికి శంకర్ హీరో చరణ్, నిర్మాత దిల్ రాజుకు చుక్కలు చూపిస్తున్నాడు.. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల పరిస్థితి ఏంటో చూడాలి మరి.