ఇకపై విరామం లేకుండా సినిమాలు చేస్తానంటూ ప్రకటించాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్. గతంలో తీసుకున్నట్లు నాలుగేళ్ల విరామం ఇకపై కెరీర్ లో ఎప్పుడూ తీసుకోనని అన్నాడు. 2018లో జీరో సినిమా రిలీజ్ తర్వాత నాలుగేళ్లు షారుఖ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. కోవిడ్ సీజన్ రావడం కూడా రెండేళ్లు ఆయనకు సినిమా లేకుండా చేసింది. ఆ తర్వాత పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు షారుఖ్.
వీటిలో పఠాన్, జవాన్ సినిమాలు వరల్డ్ వైడ్ 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించాయి. ఈ నేపథ్యంలో ఇకపై నాలుగేళ్ల విరామం తీసుకోనని ప్రకటించాడు. సినిమా సినిమాకు మధ్య రెండు నెలల విరామం మాత్రమే ఇస్తానంటూ తెలిపాడు. సినిమాలు చేయని టైమ్ లోనూ అభిమానులు చూపించిన ప్రేమ తనను కదిలించిందని ఈ స్టార్ హీరో ఎమోషనల్ అయ్యాడు. వారి కోసమే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తానంటూ వెల్లడించాడు.