హీరో శర్వానంద్ ఈ మధ్య మీడియాలో కనిపించడం తగ్గింది. కారణం ఆయన సినిమాల విడుదల సందడి లేదు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరో రెండు సినిమాలను లైనప్ చేసుకున్నారు శర్వానంద్.
శర్వానంద్ సామజవరగమన సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజ్ తో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. అలాగే మ్యాడ్ సినిమా దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకారం తెలిపారు శర్వానంద్. ఈ రెండు సినిమా ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయి.