ప్రస్తుతం థియేటర్ రిలీజ్ కు ఓటీటీకి మధ్య పెద్దగా గ్యాప్ ఉండటం లేదు. థియేటర్ లో రన్ అవని సినిమాలు రోజుల గ్యాప్ లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇలాగే నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ‘శివం భజే’. అశ్విన్ బాబు, దిగాంగనా సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ రోజు డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది.
‘శివం భజే’ ఈ రోజు నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద దర్శకుడు అప్సర్ రూపొందించారు. ఈ నెల 1న థియేటర్స్ లోకి వచ్చింది ‘శివం భజే’. సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలు కలిపిన యాక్షన్ డ్రామాగా ‘శివం భజే’ సినిమా రూపొందింది.
చదవండి: నానికి జంటగా జాన్వీ..?
ఈ సినిమా థియేటర్స్ లో అంతగా ఆదరణ పొందలేదు. అయితే నిర్మాతకు ఈ సినిమా నష్టాలు తీసుకురాలేదు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు మంచి రేట్ వచ్చింది. దీంతో ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యాడు. థియేటర్స్ నుంచి కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చే రెస్పాన్స్ కోసం మూవీ మేకర్స్ ఎదురుచూస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ తో పాటు విలన్ పాత్రకు సంబంధించిన ట్విస్టులు ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాయి.