ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఆర్సీ 16గా పిలుస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రకు ఎంపికచేశారట. శివరాజ్ కుమార్ ఇటీవల రజనీకాంత్ జైలర్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించారు.
ఈ క్యారెక్టర్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ క్రేజ్ తో శివరాజ్ కుమార్ ను ఆర్సీ 16కు తీసుకున్నారట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా సినిమా ఇది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్చి నుంచి ఆర్సీ 16 సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.