‘శ్రద్ధ’గా చేరుకుంది..?
నటి దెబ్బకు కుదేలైన ప్రధాని..?
దేశంలో అత్యధిక టాప్ 3 ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్యలో శ్రద్ధాకపూర్ దూసుకెళ్లారు. అదీకూడా మూడోస్థానంలో ఉన్న ప్రధాని మోదీని వెనక్కినెట్టి, శ్రద్ధాకపూర్ టాప్ 3 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆగస్టు 15న బాలీవుడ్‌లో రిలీజైన అన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోగా, ఒక్క శ్రద్ధాకపూర్ నటించిన చిత్రం స్త్రీ-2 మాత్రం రాకెట్‌లా దూసుకెళ్తోంది. కలెక్షన్ల జోరు రోజురోజుకు పెరుగుతోంది. కేవలం సినిమాకు అయిన బడ్జెట్ 50 కోట్లే అయినా, స్త్రీ-2 మూవీ 500 కోట్ల క్లబ్‌లో చేరడం పక్కా అని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. మరి అలాంటి స్త్రీ-2 హిట్ టాక్‌తో మరింత ప్రజాభిమానం చూరగొన్న శ్రద్ధాకపూర్…ఇన్ స్టా వేదికగా మరింత ఫాలోవర్లను సాధించుకుని అక్కడకూడా ట్రెండ్ క్రియేట్ చేశారు.
చదవండి: మంకీపాక్స్‌పై WHO కీలక ప్రకటన..?
ఎవరెవరికి ఎంతమంది..?
ఇండియాలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా కోహ్లీ కొనసాగుతున్నారు. కోహ్లీకి 271 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, 91.8 మిలియన్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో ప్రియాంకచోప్రా ఉన్నారు. కాగా కొన్నిగంటల క్రితమే మూడోస్థానంలో కొనసాగుతున్న ప్రధాని మోదీని పక్కకునెట్టి ముందుకు వచ్చిన శ్రద్ధకపూర్‌కు 91.5 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా…91.3 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన నాలుగో ఇండియన్‌గా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు.