నెటిజన్ కు వార్నింగ్ ఇచ్చింది స్టార్ హీరోయిన్ శృతి హాసన్. నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అనే బేధాలు చూపించవద్దని అతనిని మందలించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ తరుచూగా వారితో ఛాట్ చేస్తుంటుంది. శృతి ఆన్ లైన్ లోకి వచ్చిందంటే వేలాది మంది ఆమెతో ఛాట్ చేసేందుకు రెడీగా ఉంటారు. ఇలా రీసెంట్ గా జరిగిన ఓ ఛిట్ ఛాట్ లో శృతి హాసన్ శృతి హాసన్ కు కోపం తెప్పించాడో నెటిజన్. ఆమెను సౌత్ యాసలో ఏదైనా మాట్లాడమని అన్నాడు.
అతని మాటల్లోని ఇంటెన్షన్ అర్థమైన శృతి హాసన్..మేము సౌత్ అనే తక్కువగా చేసి చూడొద్దని, ఇడ్లీ సాంబార్ అంటూ మమ్మల్ని విమర్శించవద్దని వార్నింగ్ ఇచ్చింది. శృతి హాసన్ ప్రస్తుతం సలార్ 2తో పాటు డెకాయిట్ అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. డెకాయిట్ ప్రస్తుతం షూటింగ్ లో ఉండగా..సలార్ 2 సెట్స్ మీదకు వెళ్లేందుకు టైమ్ పట్టనుంది. కోలీవుడ్ లోనూ బిజీగా ఉంది శృతి.