నోరు జారడం ఆ తర్వాత నాలుక కరుచుకోవడం హీరో సిద్ధార్థ్ కు అలవాటే. ఎన్నో సోషల్, పొలిటికల్ ఇష్యూస్ లో ఇలాగే మాట్లాడి వివాదాలు కొని తెచ్చుకున్నాడు. రీసెంట్ గా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు
హీరో సిద్ధార్థ్. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ పై అతను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దాంతో వాటిని వెనక్కి తీసుకుంటూ తన మాటల్ని అపార్థం చేసుకున్నారని కొత్త వీడియో రిలీజ్ చేశాడు సిద్ధార్థ్.
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమంలో స్టార్స్ పాల్గొనాలని, అప్పుడే ప్రభుత్వపరంగా సహకారం ఉంటుందని తెలిపింది. దీనిపై సిద్ధార్థ్ మాట్లాడుతూ మేము మీరు అది చేస్తేనే మేము ఇది చేస్తామని ఇప్పటిదాాకా ఏ ప్రభుత్వం మాకు చెప్పలేదు అన్నాడు. సిద్ధార్థ్ మాటలు వైరల్ కావడంతో మరో వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో సిద్ధార్థ్ మాట్లాడుతూ సోషల్ ఇష్యూస్ కోసం ప్రచారం చేసేందుకు తామెప్పుడూ ముందుంటామని అన్నాడు. ఈవెంట్ లో తాను మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు.