కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో కృష్ణ వంశీ సినిమా విశేషాలు పంచుకున్నారు.
చదవండి: ‘సరిపోదా శనివారం’ నుంచి నాని యాక్షన్ పోస్టర్ రిలీజ్
హీరో కృష్ణ వంశీ మాట్లాడుతూ – ‘అలనాటి రామచంద్రుడు’ చిత్రంలో నా పాత్ర పేరు సిద్దు. సిద్దు చాలా నిజాయితీ గల మనిషి. రాముడు లాంటి మనిషి. ఒక్క అబద్ధం కూడా చెప్పడు. తనలో తనే ఘర్షణ పడుతుంటాడు. సినిమా బ్యూటీఫుల్, పొయిటిక్ గా వుంటుంది. సముద్రంలో చాలా అలజడులు వుంటాయి. నా పాత్ర కూడా అలాంటిదే. ఇందులో హీరోయిన్ పాత్ర పేరు ధరణి. సముద్రం, భూమి ఎలా కలుస్తారనేది చాలా పొయిటిక్ గా ప్రజెంట్ చేశారు. యూత్ థౌజెండ్ పెర్సెంట్ కనెక్ట్ అవుతారు. అలాగే ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఎమోషన్ కనెక్ట్ అయితే ఎవరికైనా నచ్చుతుంది. అలాంటి ఎమోషన్ కనెక్ట్ అయ్యే కథ. ఇందులో ఫాదర్- డాటర్ ఎమోషన్, మదర్- సన్ ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా వుంటాయి. అన్నారు.