ఇవాళ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. జాక్, కొంచెం క్రాక్ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టారు. ఎస్వీసీసీ బ్యానర్ లో బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది.
జాక్ టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో రెండు గన్స్ పట్టుకున్న హీరోను చూపించారు. అయితే అతని గెటప్ రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జాక్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.