సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాను అనాథ పిల్లలకు చూపించింది మహేశ్ కూతురు సితార. ఛీర్స్ ఫౌండేషన్ ద్వారా గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ స్పెషల్ వేసి పిల్లలకు సినిమా చూపించింది. ఈ సందర్భంగా సితార ఆ పిల్లలతో తీసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. గత
కొద్ది కాలంగా తన పుట్టినరోజున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది సితార. అనాథ పిల్లల చదువులకు సాయం చేయడం, వారికి సైకిళ్లు కొనివ్వడం వంటి ఛారిటీస్ చేస్తోంది. ఆద్య సితార యూట్యూబ్ ఛానెల్ ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతున్న సితార…ఓ జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. హాలీవుడ్ మూవీ ఫ్రోజెన్ 2లోని లీడ్ రోల్ కు డబ్బింగ్ చెప్పింది. తను ఇష్టపడితే సితారను సినిమాల్లోకి తీసుకొస్తామని నమ్రత గతంలో ఓ సందర్భంలో చెప్పింది.