కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ మరో యాక్షన్ ప్యాక్డ్ మూవీకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా ఇటీవలే గ్రాండ్గా లాంచ్ అయింది. పద్మజ ఫింలిమ్స్ మరియు భువనేశ్వరి పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెలుగులో, కన్నడలో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు . శివన్న 131 గా రానున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలే ఉన్నాయి. యస్ .యన్ రెడ్డి, సుధీర్. పి వీళ్లీద్దరూ ఈ సినిమాను ఎంతో ప్రాతిష్టాత్మకంగా ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నారు.
హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా రానున్న ఈ సినిమాకు అందరూ టాప్ క్లాస్ టెక్నీషిన్స్ వర్క్ చేస్తున్నారు. సంగీతం సామ్ సి ఎస్ అందిస్తుంటే, ఎ.జే. శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శివన్న ఇంత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడం హ్యాపీ గా ఉంది అంటున్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు రచన – దర్శకత్వం
కార్తీక్ అద్వైత్ అందిస్తున్నారు.