చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉంటున్న శివాజీ, బిగ్ బాస్ తరువాత
స్పీడ్ అందుకున్నాడు. ఈ టీవి విన్లో వచ్చిన 90’s వెబ్ సిరిస్కు మంచి పేరు రావడంతో సినిమాలు, వెబ్ సిరీస్ బాగానే ప్లాన్ చేస్తున్నాడు. కొన్నింటికి శివాజీ నిర్మిస్తుంటే..కొన్నింటిలో ఆయన మెయిన్ లీడ్గా చేస్తున్నాడు.
ఒకప్పుడు నాతో సినిమాలు చేసినా ఓపినింగ్స్ రావు.. నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి. అని చెప్పి అని కనీసం 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ వరసగా సినిమాలతో బిజీ అయిపోయాడు. 2014 నుండి 2024 వరకూ రాజీయాల్లో బిజీ ..బిజీ గా ఉన్న శివాజీ ఇప్పుడు రిలాక్స్ అయ్యాడు. ఆంద్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఆయనకు రాజకీయ విమర్శలు చేసే పని లేదు కాబట్టి తన సొంతగూటికే చేరిపోయాడు శివాజీ.
శ్రీ శివాజీ ప్రోడక్షన్లో నెం 2 గా తానే నిర్మాతగా సినిమా చేస్తున్నారు
శివాజీ. క్రైం , కామెడీ తో తెరకెక్కతున్న ఈసినిమాతో సుధీర్ శ్రీరామ్ అనే దర్శకుడు తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు.గతంలో మిస్సమ్మ, టాటా- బిర్లా మధ్యలో లైలా , అదిరిందయ్యా చంద్రం సినిమలతో మంచి ఫైయిర్ టాక్ తెచ్చుకున్న శివాజీ, లయ ఈ సినిమా ద్వారా మళ్లీ కలసి నటించనున్నారు. పెళ్లి అయిన తరువాత లయ లీడ్ రోల్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది అని అంటున్నారు నిర్మాతలు.