క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన శివాజీ..ఆ తర్వాత హీరోగా మారి పలు హిట్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఆయన కెరీర్ నెమ్మదించింది. రాజకీయాల మీద శివాజీ దృష్టి పెట్టడటంతో ఇండస్ట్రీకి దాదాపుగా దూరమయ్యారు. ఇలాంటి టైమ్ లో బిగ్ బాస్ తో మళ్లీ ఫేమ్ లోకి వచ్చారు శివాజీ. ఆయన త్వరలో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా శివాజీ నటించిన 90 మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ అయ్యింది. ఈ క్రేజ్ తో మళ్లీ మూవీస్ ఆఫర్స్ శివాజీకి వస్తున్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో రానున్న మూవీలో శివాజీ ఓ కీ రోల్ చేస్తున్నారట. ఇది విలన్ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జగపతి బాబు, శ్రీకాంత్ ను విలన్ గా చూపించారు బోయపాటి. ఇప్పుడు శివాజీతో విలనీ చేయించబోతున్నారు. ఈ విలన్ రోల్ క్లిక్ అయితే శివాజీకి కొత్త ఇన్నింగ్స్ మొదలైనట్లే.