కృష్ణంరాజు గారి ఆశయాల్ని కొనసాగిస్తాం – శ్యామలాదేవి

Spread the love

రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఆయన స్వస్థలం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో, కృష్ణం రాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి వెయ్యి మందికి పైగా పేషెంట్స్ హాజరయ్యారు. మనదేశంతో పాటు యూకే, యూఏఈ దేశాలకు చెందిన సుమారు 40 మంది నిష్ణాతులైన వైద్యులు ఈ శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందించారు. డయాబెటిక్ ఫుట్ ఉచిత స్క్రీనింగ్, మందులు, కౌన్సెలింగ్ అందించారు. ఇండియా వైద్య బృందానికి హైదరాబాద్ జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ శేషబత్తారు సారథ్యం వహించారు. భీమవరంలోని డా.వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైద్యులు డా.వర్మ, ఇంపీరియల్ హాస్పిటల్ వైద్యులు డా. నరేష్ ఈ వైద్య శిబిరంలో తమ సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన రోగులను అడాప్ట్ చేసుకుని వాళ్లకు భవిష్యత్ లోనూ కావాల్సిన వైద్య సహాయం అందిస్తామని డాక్టర్స్ తెలిపారు.

ఈ వైద్య శిబిరం విజయవంతం కావడంపై శ్యామలాదేవి గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడం ఆనందంగా ఉంది. డయాబెటిక్ పుట్ సమస్యలతో వచ్చిన ఎంతోమంది పేషెంట్స్ మా క్యాంప్ లో వైద్య సహాయం పొందడం ఎంతో సంతృప్తిని కలిగించింది. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించి, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనేది కృష్ణంరాజు గారి కల. ఆయన ఆశయాల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అని చెప్పారు.

కృష్ణంరాజు గారి కూతురు ప్రసీద గారు మాట్లాడుతూ – నాన్నగారి కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు అమ్మ శ్యామలాదేవి ఎంతో పట్టుదలగా కృషి చేసింది. పేద ప్రజలు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలనేది అమ్మ సంకల్పం కూడా. ఈ వైద్య శిబిరంలో అమ్మ తన పేరును మొదటగా రిజిస్టర్ చేసుకుంది. భవిష్యత్ లోనూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహిస్తాం. అని చెప్పారు.

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...