బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాలకు మారుపేరు. హృతిక్ రోషన్ తో గొడవ మొదలు, కాంగ్రెస్, శివసేన పార్టీలతో కయ్యం వరకు ఆమె ఇష్యూ చేయని సందర్భం లేదు. ఇటీవల బీజేపీలో చేరి కొంత ప్రశాంతంగా ఉంటోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచింది. ఈ నేపథ్యంలో తన పెండింగ్ ప్రాజెక్ట్ ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.
సెప్టెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో కంగనా మీద ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడటంతో ఈ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరాగాంధీగా నటించింది కంగనా. నటించడమే కాదు నిర్మించి దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి ఇతర పాత్రలు పోషించారు.