బాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోంది. దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లికూతురిగా మారనుంది. నటుడు ఇక్బాల్ తో సోనాక్షి వివాహం రేపు ముంబైలో ఘనంగా జరగనుంది. ఇవాళ మెహందీ వేడుకలు సందడిగా జరిగాయి. సోనాక్షి సిన్హా మెహందీ ఫంక్షన్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రేపటి పెళ్లి వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలో సోనాక్షి, ఇక్బాల్ కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు.
డబుల్ ఎక్స్ ఎల్ సినిమాలో సోనాక్షి, ఇక్బాల్ కలిసి నటించారు. ఇప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. భిన్న మతాలు కావడంతో కుటుంబ సభ్యుల మద్ధతు లభించలేదు. సోనాక్షి, ఇక్బాల్ పెళ్లి చేసుకునే పట్టుదలతోనే ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అనక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే వీరి వివాహం పెద్దలకు ఇష్టం లేదనే వార్తలు వచ్చాయి. సోనాక్షి కుటుంబ సభ్యులు ఆమె పెళ్లికి అంగీకారం తెలుపలేదనే రూమర్స్ రాగా..వాటిని ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు.