తన ప్రేయసి పవిత్ర గౌడను టీజ్ చేస్తున్నాడనే కారణంతో రేణుకస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడు కన్నడ హీరో దర్శన్. కొందరితో కలిసి దర్శన్ ఈ హత్య చేయించడమే కాకుండా ఆ హత్యలో పాల్గొన్నాడు. పవిత్ర గౌడ కూడా హతుడిని గాయపర్చింది. ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు దర్శన్.
దర్శన్ కు జైలులో పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శన్ కు సంబంధించిన ఓ జైలు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జైలులో కొందరు ఫ్రెండ్స్ తో కలిసి సిగరెట్స్ తాగుతూ డ్రింక్ చేస్తూ ఉందా ఫొటోలో.
చదవండి: రజనీ కోసం సూర్య పోటీ నుంచి తప్పుకుంటున్నాడా..?
ఈ ఫొటో సోషల్ మీడియాలోకి రాగానే ట్రోలింగ్ మొదలైంది. కన్నడ జైలు అధికారులు నేరస్తులకు ఇలాంటి మర్యాదలు చేయడంపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. డబ్బుంటే ఏదైనా సాధ్యమేనని దర్శన్ ఉదంతం గుర్తుచేస్తోంది. ఈ ఫొటో వైరల్ కాగానే ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.