టాలీవుడ్ లోకి ఒక కెరటంలా దూసుకొచ్చింది శ్రీలీల. ఈ యంగ్ హీరోయిన్ ధమాకా సినిమా సక్సెస్ తో దాదాపు డజను సినిమాలు ఖాతాలో వేసుకుంది. ఏ స్టార్ హీరోతో అయినా శ్రీలీలే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఆమె సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ బౌన్స్ అవుతున్నాయి. శ్రీలీల చేసిన గత మూడు సినిమాలు ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. ఈ మూడు వరుస ఫ్లాప్స్ తో హీరోయిన్ గా శ్రీలీల క్రేజ్ కు బ్రేక్ పడుతున్నట్లు తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల చేసిన ఆదికేశవ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత నితిన్ తో నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మహేశ్ తో చేసిన సంక్రాంతి సినిమా గుంటూరు కారం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఇలా మూడు సినిమాలు వరుసగా శ్రీలీలకు బ్యాడ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చాయి. వీటిలో ఆమె తప్పేం లేదు. దర్శకుడు ఇచ్చిన క్యారెక్టర్ చేసింది, డ్యాన్సులతో, నటనతో , అందంతో ఆకట్టుకుంది. అయితే గత సినిమాల సక్సెస్ ను శ్రీలీలకు ఇచ్చినట్లే…ఈ ఫ్లాప్స్ కూడా ఆమె ఖాతాలోనే పడతాయి. వాటి ఎఫెక్టు కూడా అలాగే ఉంటుంది.