‘ఛాంపియన్’ గా రోషన్
పెళ్లి సందడి తరువాత చాలా కధలు విన్న శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక ఇప్పుడు ఛాంపియన్గా రాబోతున్నాడు. స్వప్న సినిమా, ఆనందీ ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఛాంపియన్ సినిమా కు సంభంధించి పూజా కార్యక్రమాలు ఈ ఆదివారం ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లనున్న ఈ సినిమా ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు పాన్ ఇండియా దర్శకుడు నాగ అశ్విన్.
యంగ్ హీరో రోషన్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ యూనిక్ స్క్రిప్ట్ను సిద్దం చేసారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం. ఈ డైనమిక్ రోల్ కోసం రోషన్ కంప్లీట్ మేకోవర్తో కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. ఈ పీరియాడికల్ బ్యాక్ మూవీ కోసం టాప్ క్లాస్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఆర్. మదీ అందిస్తుంటే, ఆర్ట్ డైరెక్టర్గా పద్మశ్రీ తోట తరణి వర్క్ చేస్తున్నారు.