తేజ సజ్జ హీరోగా నటిస్తున్న హనుమాన్ సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 12న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా విడుదలవుతున్నా..హనుమాన్ వెనక్కి వెళ్లలేదు. రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ హనుమాన్ నుంచి శ్రీరామ దూత స్తోత్రం రిలీజ్ చేశారు. ఆంజనేయ భక్తిని, శక్తినీ చూపించిన ఈ వీడియో పవర్ ఫుల్ గా ఉంది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ఈ సూపర్ హీరో సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హనుమంతుడిని శక్తిని పొందిన ఓ మనిషి సూపర్ హీరోగా ఎలా మారాడు, అతను నకిలీ సూపర్ హీరోలను ఎలా ఎదిరించాడు అనేది సినిమా కథగా ఉండబోతోంది. సోషియో ఫాంటసీ జానర్ లో హనుమాన్ ను రూపొందించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.