సమంత నటించాల్సిన హాలీవుడ్ మూవీ చెన్నై స్టోరీ శృతి హాసన్ దక్కించుకుంది. ఈ సినిమాను తమిళం, ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా దర్శకుడు ఫిలిప్ జాన్ రూపొందిస్తున్నారు. సమంత హీరోయిన్ గా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ నుంచి తాజాగా సమంత తప్పుకుంది. ఆమె అనాారోగ్యానికి చికిత్స కొనసాగుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సమంత ప్లేస్ లో శృతి హాసన్ ను తీసుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. వివేక్ కల్రానీ మరో కీ రోల్ లో కనిపించనున్నారు.
2004లో వచ్చి నవల ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ ఆధారంగా చెన్నై స్టోరీ సినిమా తెరకెక్కుతోంది. గురు ఫిలింస్ బ్యానర్ లో తాటి సునీత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చెన్నై స్టోరీ సినిమాలో బై సెక్సువల్ డిటిక్టివ్ పాత్రలో శృతి హాసన్ కనిపించనుంది. బోల్డ్ గా కనిపించాల్సిన ఈ క్యారెక్టర్ కు సమంత కన్నా శృతి మంచి ఆప్షన్ అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సలార్ తో బిగ్ సక్సెస్ అందుకుంది శృతి హాసన్.