హారర్ కామెడీ మూవీస్ వర్కవుట్ అయితే ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాయో ప్రూవ్ చేస్తోంది స్త్రీ 2 సినిమా. సూపర్ హిట్ మూవీ స్త్రీ సీక్వెల్ గా రిలీజైన స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పలు మూవీస్ బాక్సాఫీస్ రికార్డులు దాటేసిన స్త్రీ 2 ఇప్పుడు కేజీఎఫ్ 2 రికార్డులు బద్దలు కొట్టింది. స్త్రీ 2 లో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కేజీఎఫ్ 2 బాలీవుడ్ లో 435 కోట్ల రూపాయల వసూళ్లు అందుకోగా ఇప్పుడు స్త్రీ 2 సినిమా 442 కోట్ల రూపాయల వసూళ్లతో కేజీఎఫ్ 2 ను దాటేసింది. స్త్రీ 2 జోరు చూస్తుంటే మరిన్ని సినిమాల బాక్సాఫీస్ రికార్డ్ లు చెరిగిపోయేలా ఉన్నాయి. అతి త్వరలో స్త్రీ 2 సినిమా 500 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరనుంది.
చదవండి: “దేవర” అదిరిపోయే అప్ డేట్
ఈ సినిమాను దర్శకుడు అమర్ కౌశిక్ రూపొందించారు. వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న మ్యాడాక్ ఫిలింస్ సంస్థ స్త్రీ 2 తో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ మూవీ, హయ్యెస్ట్ సెకండ్ వీక్ కలెక్టెడ్ మూవీ వంటి పలు రికార్డులు సొంతమయ్యాయి.