ఏదీ వర్కవుట్ కావడం లేదని చివరకు పుష్పలా సుధీర్ బాబు ట్రై చేసిన సినిమా హరోం హర. గత నెలలో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఎల్లుండి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. రాయలసీమ యాసలో పుష్పరాజ్ లా కనిపించాలని అనుకున్న సుధీర్ బాబుకు థియేటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ఓటీటీ లవర్స్ అయినా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారేమో చూడాలి.
జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ డ్రామా కథతో హరోం హర సినిమా చేశాడు హీరో సుధీర్ బాబు. ఇటీవల తనకు ఫ్లాప్స్ పడుతున్న నేపథ్యంలో ఈ యాక్షన్ డ్రామా సక్సెస్ తీసుకొస్తుందని ఆశించాడు. అయితే అతనికి ఆశించిన ఫలితం దక్కలేదు. కథా కథనాల్లో బలం లేకపోవడం, సెకండాఫ్ దారి తప్పి హరోం హర ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.