నవ దళపతి సుధీర్ బాబు హీరో గా రాబోతున్న బై లింగ్వల్ మూవీ కి జటాధర అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ప్రేక్షకులకు గ్రేట్ సినిమాటిక్ యూనివర్స్ అందించడానికి ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు . ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, నిఖిల్ నందా , ఉజ్వల్ ఆనంద్ కలిసి సినిమాను హై బడ్జెట్ లో ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. రుస్తోమ్, టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ వంటి హిట్స్ ఇచ్చిన విజనరీ ప్రోడ్యూసర్ నిర్మాణ సారధ్యంలో జటాధర మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో సుధీర్ బాబు చాలా పవర్ ఫుల్ కనిస్తున్నాడు.
గతంలో సుధీర్ భాగీ అనే సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఏంట్రీ ఇచ్చారు . చాలా కాలం గ్యాప్ తరువాత సుధీర్ బాబు బాలీవుడ్లో ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా మరళా దగ్గర కానున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్గా రానున్న ఈ సినిమా 2025 మహాశివరాత్రి కి ప్రేక్షకుల ముందుకు రానుంది. జటాధర అనే పవర్ ఫుల్ టైటిల్తో రానున్న ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు.