కమెడియన్ నుంచి విలన్ కు అక్కడి నుంచి హీరోకు మారారు సుహాస్. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్నా అవి ఆదరణ పొందడం లేదు. రీసెంట్ గా రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ప్రసన్నవదనం సినిమాలు ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాయి. ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా ‘జనక అయితే గనక’ మీదే హోప్స్ పెట్టుకున్నాడు సుహాస్.
దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ కోర్ట్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎల్లుండి ‘జనక అయితే గనక’ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘జనక అయితే గనక’ సినిమా టైటిల్ తో పాటు పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు.