దర్శకులు సుకుమార్ తన మంచి మనసు చాటుకున్నారు. ఆయన తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి 5 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. సభ్యుల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఈ డబ్బు వినియోగించనున్నారు.
చదవండి: పసిడి మరింత ‘ప్రియం’
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని ఈ ఏడాది గ్రూప్ ఇన్సూరెన్స్ పథకానికి తానిప్పుడు ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నానని సుకుమార్ చెప్పారు. సుకుమార్ తమ సంఘానికి 5 లక్షల విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.