డైరెక్టర్ సుకుమార్ హీరో రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా టాలీవుడ్ సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా మారిపోయింది. ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ మూవీలో నటిస్తున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమా మరికొద్ది రోజుల్లో షూటింగ్ బిగిన్ చేసుకోనుంది. ఇది రామ్ చరణ్ నటిస్తున్న 16వ సినిమా కాగా..17వ ప్రాజెక్ట్ గా సుకుమార్ డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ఆయనకు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సిన కమిట్ మెంట్ ఉంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమా రంగస్థలం సీక్వెల్ అయితే మెగాభిమానులు చాలా హ్యాపీగా ఫీలవడం ఖాయం.