హర్ష చెముడు, దివ్య శ్రీపాద లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘సుందరం మాస్టర్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుంది. ఈ సినిమాను హీరో రవితేజ ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సుందరం మాస్టర్’ సినిమాను సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథతో వినోదాత్మకంగా రూపొందించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు.
గవర్నమెంట్ టీచర్ అయిన సుందరం మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెకు ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్తాడు. ఈ పల్లెలో అన్ని వయసులవారికి ఇంగ్లీష్ నేర్పించాల్సి వస్తుంది. ఏమీ తెలియని పల్లె ప్రజలకు సుందరం మాస్టర్ ఇంగ్లీష్‌ను ఎలా బోధించారు అనేది ఫుల్ ఫన్ తో ఉండబోతోంది. ఇదే విషయాన్ని ప్రమోషన్ లో రిలీజ్ చేస్తున్న వీడియోల ద్వారా చూపిస్తున్నారు. సహజంగానే హర్షలో ఉన్న కామెడీ స్పార్క్ సుందరం క్యారెక్టర్ లో మరింత నవ్వులు తెప్పించేలా కనిపిస్తోంది.