తేజ సజ్జ హీరోగా నటిస్తున్న హనుమాన్ సినిమా ప్రీమియర్ షోస్ లో క్రేజ్ చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం వేస్తున్న 150 ప్రీమియర్ షోస్ హౌజ్ ఫుల్ అయినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 12న హనుమాన్ సినిమా రిలీజ్ అవుతోంది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ ప్రీమియర్ షోస్ కు బుకింగ్స్ పూర్తయ్యాయి.
ఇది తమ సినిమా పట్ల ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ కు ప్రూఫ్ అని మూవీ టీమ్ అంటున్నారు. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాతో పాటుగా హనుమాన్ రిలీజ్ అవుతోంది. పెద్ద సినిమాతో పోటీ పడి మరీ బాక్సాఫీస్ రేసులో నిలబడుతోంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించారు. సోషియో ఫాంటసీ సూపర్ హీరో కథతో తెరకెక్కిన హనుమాన్ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి బరిలో ఉన్న నాలుగు సినిమాల్లో చిన్న చిత్రం హనుమాన్ ఒక్కటే.