సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్టేజియస్ మూవీ ‘వేట్టైయాన్’ విడుదలకు సిద్దం అయింది. అక్టోబర్ 10 న ప్రపంచవ్వాప్తంగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెఢీ అయ్యారు. ఇక ఈ సినిమా గురించి చెప్పుకుంటే , రజనీ కాంత్ భారీ హిట్స్ అయిన రోబో 2.0 , దర్బార్, లాల్ సలామ్ తరువాత లైకా ప్రోడక్షన్స్లో నాలుగో సినిమా గా వస్తుంది ఈ వేట్టైయాన్ . ఎప్పుడూ సమాజిక పరమైన నాణ్యమైన సినిమాలు తీస్తూ విమర్శకులు ప్రశంసలు పొందుతున్న దర్శకుడు
టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే పేట, దర్బార్, జైలర్ తరువాత రజనీ కాంత్ కు అనిరుధ్ సంగీతం అందిస్తున్న నాలుగో సినిమా కావడం ఓ విశేషం.
‘వేట్టైయాన్’లో భారీ తారాగణం నటించడంతో ఈ సినిమా మీద ఆడియన్స్ భారీ అంచనాలే ఉన్నాయి. చాలా కాలం తరువాత రజనీ కాంత్ సినిమాలో అమితాబ్ ఓ కీలకపాత్ర పోషించడం జరిగింది. ఇంకో విషేషం ఏమిటి అంటే, అంధాకానూన్, గిరఫ్తార్, హమ్ సినిమాల తరువాత రజనీకాంత్ , అమితాబచ్చన్ కలిసి నటిస్తున్న నాలుగో చిత్రం కూడా ఇదే.
ఆడియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వడానికి తెలుగు, తమిళ, మళయాల, కన్నడ , హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మంజు వారియర్, రాణా దగ్గుపాటి, ఫహద్ ఫాజిల్, రోహిణి, రితికా సింగ్ , అభిరామి నటిస్తున్నారు. అన్నీ హంగులతో అక్టోబర్ 10 న ‘వేట్టైయాన్’గా అక్టోబర్ 10 న రాబోతున్నారు తలైవా.