హేమ కమిటీ రిపోర్ట్‌తో “అమ్మ” రద్దు..!

Spread the love

హేమ కమిటీ రిపోర్ట్‌తో “అమ్మ” రద్దు..!

మలయాళ ఇండస్ట్రీలో నటీమణులు, మహిళా టెక్నీషియన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి పినరయి సర్కార్‌…జస్టిస్‌ హేమ ఆధ్వర్యంలో కమిటీ వేయడం…సదరు కమిటీ సభ్యులు 230 పేజీల పైబడి ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై రిపోర్ట్‌ ఇవ్వడం తెలిసిందే. అయితే ఇప్పుడీ రిపోర్ట్‌ మల్లువుడ్‌లో సంచలనం రేకెత్తించింది. ఏకంగా మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (అమ్మ)ను రద్దుచేసే పరిస్థితికి తీసుకొచ్చింది. అయితే దీనికంటే ముందు, నటుల లైంగిక వేధింపుల ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ ప్యానెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం మరో సంచలనంగా మారింది.

వరుసగా లైంగికవేధింపుల కేసులు..?

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టును సీరియస్‌గా తీసుకున్న కేరళ సర్కార్‌ ఇప్పటివరకు 17మందిపై కేసులు నమోదుచేసింది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నటులు, నిర్మాతలని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు తాజా పరిణామాలతో ఒక్కొక్కరుగా బాధితులు ముందుకువస్తున్నారు. ఓ షూటింగ్ సమయంలో తాను టాయిలెట్‌ నుంచి బయటకు రాగానే హీరో జయసూర్య వెనకనుంచి కౌగలించుకుని ముద్దులు పెట్టాడని నటి సోనియా మల్హార్‌ కంప్లైంట్ ఇచ్చింది. తనకు నచ్చినట్లు చేస్తే మరిన్ని ఛాన్సులు ఇచ్చేలా చూస్తానని చెప్పినట్లు ఆరోపించింది. అలాగే, అమ్మ సభ్యత్వం పొందేందుకు సాయం చేస్తానని చెప్పి అమ్మ మాజీ సెక్రటరీ ఇడవెల బాబు తన ఫ్లాట్‌కు పిలిచి శారీరకంగా వేధించాడని కంప్లైంట్‌లో పేర్కొన్నారామె. అధికార సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేశ్‌ కోరినట్లుగా చేయలేదని తనకు సభ్యత్వాన్ని తిరస్కరించినట్లు కూడా ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు నటి సోనియా మల్హర్. అలాగే దీనికి కొనసాగింపుగా బెంగాలీనటి శ్రీలేఖ మిత్ర కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. దర్శకుడు రంజిత్‌ తనను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఏచిత్ర పరిశ్రమలో అయినా వేధింపులు బహిరంగర రహస్యమని చెప్పుకొచ్చారామె. కాగా, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సిట్‌కు ఇండస్ట్రీలో ఉన్న మహిళల నుంచి ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెరవెనుక ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్తల రాసలీలలు బయటపడే అవకాశాలులేకపోలేదన్నది మల్లువుడ్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది.

Hot this week

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో 30మందికిపైగా మావోలు మృతి.

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో అలజడి ఎదురుకాల్పుల్లో 30మందికిపైగా మావోలు మృతిమావోల కంచుకోటలో అలజడి రేగింది....

హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..?

హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..? హర్షసాయిపై బాధితురాలు మరో కంప్లైంట్‌..! ఇంతకీ...అత్యాచార ఆరోపణలు...

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్‌..

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ సీఎం..! కొత్త ఇల్లు చూసుకుని వెళ్లిపోయిన...

అధికారంలోకి వచ్చాక.. పవన్‌కు మతపిచ్చి పట్టుకుందన్న షర్మిల

అధికారంలోకి వచ్చాక పవన్ మారిపోయాడు పవన్‌కు మతపిచ్చి పట్టుకుందన్న షర్మిల తిరుపతి వారాహిసభ వేదికగా...

“దళపతి 69” మూవీ లాంఛ్

తమిళ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న సినిమాగా...

Topics

“రాజా సాబ్” టార్గెట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ది...

నందిగం సురేష్‌కు హైకోర్టులో బెయిల్‌

వైసీపీ మాజీ ఎంపీకి బెయిల్‌..! నందిగం సురేష్‌కు హైకోర్టులో ఊరట..! గత ఐదేళ్ల జగన్‌...

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..!

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..! మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడికేసులో తాను అమాయకుడిని...