ఈ రోజు స్టార్ హీరో సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే గ్లింప్స్ ను సూర్య కొత్త సినిమా నుంచి రిలీజ్ చేశారు. సూర్య 44గా పిలుస్తున్న ఈ మూవీని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్నారు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ లో ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
చదవండి:‘రామ్ ఎన్‌ఆర్‌ఐ’గా వస్తున్న ‘బిగ్ బాస్’ అలీ రెజా
నిన్న రాత్రి 12.12 నిమిషాలకు సూర్య 44 నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో సముద్రంలో ప్రేమ, వినోదం, యుద్ధం అతని కోసం వేచి చూస్తున్నాయి. అంటూ సూర్యను పరిచయం చేశారు. సూర్య లుక్స్, క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది.