కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ చిత్రం కంగువ. ఈ మూవీకి శివ డైరెక్టర్. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇది రెగ్యులర్ మూవీ కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించే ఛాన్స్ ఉందనే టాక్ వచ్చింది. అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. రజినీ వెట్టాయన్ అదే డేట్ కి వస్తుండడంతో కంగువ వస్తుందా..? వాయిదా పడనుందా..? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.. ఇంతకీ ఏం జరగనుంది..?
కంగువ వాయిదా అంటూ ప్రచారం జరిగింది. దీంతో ఇది గ్యాసిప్ అనుకున్నారు కానీ.. సూర్య స్వయంగా రజినీ వెట్టాయన్ మూవీ కోసం కంగువ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించడంతో రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. అక్టోబర్ 10 అనేది మంచి డేట్. దసరా సెలవుల్లో వచ్చే వీకెండ్. తెలుగు, హిందీల్లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. కంగువ మూవీకి పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ఉండడంతో దసరాకి వస్తే.. బాక్సాఫీస్ షేక్ అయ్యేది కానీ.. ఇప్పుడు అలా జరగడం లేదు. ఈ మూవీకి ఇంత మంచి డేట్ దొరకకపోవచ్చు.
చదవండి: వర్షాలతో తెలుగునాట దడ..!
దీపావళికి హిందీలో రెండు భారీ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. తమిళంలో అజిత్ మూవీ విడాముయర్చి, శివ కార్తికేయన్ అమరన్ రిలీజ్ కానున్నాయి. ఇక తెలుగులో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ మెకానికి రాఖీ చిత్రాలు విడుదల కానున్నాయి. దీపావళికి ఈ సినిమాలు అన్నీ థియేటర్స్ లోకి వస్తే.. కంగువకు కావాల్సినన్ని థియేటర్లు దొరకకపోవచ్చు. దీంతో ఈ సినిమాల పోటీ ప్రభావం కంగువ కలెక్షన్స్ పై పడుతుంది. డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ చేద్దామంటే.. ఆల్రెడీ అన్ని డేట్స్ ఫిక్స్ అయ్యాయి. కంగువ మూవీ 1000 కోట్లు సాధించాలని.. ఈ సినిమాతో 1000 కోట్ల క్లబ్ లో చేరే మొదటి తమిళ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయాలని కంగువ మేకర్స్ తపించారు. మరి.. ఈ విషయంలో కంగువ కష్టమే. మరి.. ఏం జరగనుందో చూడాలి.